News

ముఖ్యమంత్రి పూర్తిగా కోలుకున్నారు


సీఎండీ ప్రతాప్‌ సి.రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని అపోలో హాస్పిటల్స్‌ తెలిపారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ‘ జయలలిత పూర్తిగా కోలుకున్నారు. ఆమెకు ఏం కావాలో అడుగుతున్నారు. తన చుట్టూ ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకుంటున్నారు. ఎప్పుడు ఇంటికి వెళ్లాలనే దానిపై ఆమే నిర్ణయం తీసుకుంటారు’ అని ప్రతాప్‌ సి.రెడ్డి వెల్లడించారు. తీవ్ర జ్వరం కారణంగా జయలలిత సెప్టెంబర్‌ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. జయలలిత కోలుకున్నారని. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. క్రిటకల్‌ కేర్‌ విభాగం నుంచి సాధారణ గదికి త్వరలోనే మార్చనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.